భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు

24 May, 2020 09:34 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు కాగా, 147 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 54,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,867 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 73,560 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. మహారాష్ట్ర, తమిళనాడులలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో 47,190 కరోనా కేసులు నమోదు కాగా, 13,404 కోలుకున్నారు. 1,577 మంది మృతిచెందారు. మరోవైపు తమిళనాడులో 15,512, గుజరాత్‌లో 13,664, ఢిల్లీలో 12,910 కరోనా కేసులు నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు