కరోనా.. 24 గంటల్లో 62 మంది మృతి

28 Apr, 2020 10:29 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,543 కరోనా కేసులు నమోదుకాగా, 62 మంది మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,435కి చేరింది. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 8,590 కరోనా కేసులు నమోదు కాగా, 369 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 3,548,  ఢిల్లీలో 3,108, మధ్యప్రదేశ్‌లో 2,168, రాజస్తాన్‌లో 2,262, ఉత్తరప్రదేశ్‌ 1,955, తమిళనాడులో 1,937 కేసులు నమోదయ్యాయి.

చదవండి : ప్లాస్మా దానం: ప్రభుత్వానికి ఒవైసీ లేఖ

మరిన్ని వార్తలు