ఆసుపత్రిలో కరోనా రోగి పట్ల అమానుషం

7 Jul, 2020 16:20 IST|Sakshi

భోపాల్‌: బీహార్‌ పీపుల్స్‌ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కోవిడ్‌-19 సోకిన వ్యక్తిని ఆసుపత్రి సిబ్బంది రోడ్డుపై పడేసిన ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. పవర్‌ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి కిడ్నీ సమస్యతో రెండు వారాల క్రితం  ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం అతనికి శ్వాస తీసుకోవడంతో కష్టంగా ఉండటంతో అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కరోనా సెంటర్‌ అయినా చిరయూకి అతనిని తరలించారు. అయితే అక్కడికి వెళ్లే లోపే అతను చనిపోయాడని తెలియడంతో అతనిని తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చి రోడ్డుపై పడేశారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
చదవండి: కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక  ప్రకటన

ఈ విషంపై ఆసుపత్రి  చైర్మన్‌ ఉదయ్‌ శంకర్‌ దీక్షిత్‌ మాట్లాడుతూ, ‘ప్రోటోకాల్‌ ప్రకారం మేం అతనిని చిరయూ కోవిడ్‌-19 సెంటర్‌కు పంపించాం. 40 నిమిషాల తరువాత తిరిగి వచ్చేస్తున్నట్లు మా సిబ్బంది మాకు తెలిపింది. అప్పటికే మేం ఐసీయూని మూసివేశాం. ప్రోటోకాల్‌ ప్రకారం మొత్తం శుభ్రం చేయించాం. దీంతో అతడిని బయట ఉంచాం. అప్పటికే అతనిని మా సిబ్బంది రోడ్డు మీద పడేశారు. విషయం తెలుసుకున్న నేను అతనిని తీసుకురమ్మని మా సిబ్బందిని ఆదేశించగా అప్పటికే అతడు చనిపోయాడు’ అని తెలిపారు.  

చదవండి: క‌రోనా : మాజీ ఆరోగ్య‌శాఖ మంత్రి మృతి 

మరిన్ని వార్తలు