కరోనా రోగి ఆత్మహత్య: కానీ అంతలోనే

22 Jun, 2020 20:30 IST|Sakshi

సాక్షి,  పట్నా : కరోనా  వైరస్ సోకిన వ్యక్తి (38) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగి బీహార్‌లోని ప్రభుత్వ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయాడు.  అయితే  ఆవేశం అనర్ధానికి మూలం అన్నట్టుగా.. చనిపోయిన కొద్ది క్షణాలకే అతనికి నిర్వహించిన తాజా పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో అతని బంధువుల తీరని విషాదంలో మునిగిపోయారు.  

కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ సంజీవ్ కుమార్  అందించిన సమాచారం ప్రకారం   బాధిత వ్యక్తి  జూన్ 15 న కరోనా అనుమానిత లక్షణాలతో పట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరాడు. అనంతరం కరోనా పాజిటివ్ రావడంతో అతనిని ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే తనకు వ్యాధి నయం కాదనుకున్నాడో, ఏమో కానీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు.  పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని డాక్టర్ కుమార్ వెల్లడించారు. బీహార్‌లో  కరోనా బారిన పడ్డ రోగి ఆత్మహత్యకు పాల్పడిన మొదటి ఘటన ఇది అని తెలిపారు.  కాగా సోమవారం మరోసారి  నిర్వహించిన  పరీక్షల్లో వైరస్  నెగెటివ్ వచ్చిందని చెప్పారు.  

మరిన్ని వార్తలు