కరోనా సునామీ: ఒక్క రోజే 33 కేసులు

20 Mar, 2020 11:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వైరస్‌ బారిన పడుతున్న వారిలో ఇతర దేశాల నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కోటి, ఇతర రాష్ట్రాల్లో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఉదయం వరకు 197గా ఉన్న బాధితుల సంఖ్య ప్రస్తుతం 209కి చేరింది. శుక్రవారం యూకే నుంచి ఇండియాకు తిరిగొచ్చిన 69 ఏళ్ల పంజాబ్‌ మహిళకు కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఏయిర్‌ పోర్టులో దిగిన ఆమెకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పంజాబ్‌ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. ( కరోనాను టార్గెట్‌ చేసిన డించక్‌ పూజా )

ఆంధ్రప్రదేశ్‌లోనూ తాజాగా నమోదైన కేసుతో కలిపి మొత్తం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. తొలి కేసు నెల్లూరులో నమోదు కాగా, ఆ యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. ఇక వైరస్ బాధితులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర వార్తల్లో నిలిచింది. అక్కడి కరోనా బాధితుల సంఖ్య 52గా ఉంది. దేశవ్యాప్తంగా వైరస్‌ కారణంగా కోలుకోలేక ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం ఇటలీకి చెందిన ఓ టూరిస్ట్‌ జైపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. అతడి భార్య కోలుకుంటోంది. మరణించిన వారంతా 50 ఏళ్లకు పైబడి.. డయాబెటీస్‌, గుండె, ఊపిరితిత్తుల సంబంధ, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారే. కాగా, ఇప్పటివరకు 209 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, దాదాపు 14,376 శాంపిళ్లను సేకరించి 13,486 శాంపిళ్లను పరీక్షించామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది.
( కరోనా: కలకలం రేపిన వియత్నాం బృందం )

చదవండి : ఏపీలో మరో 2 కరోనా పాజిటివ్‌ కేసులు

మరిన్ని వార్తలు