షోలాపూర్‌ మేయర్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌

6 Jun, 2020 08:55 IST|Sakshi

మేయర్‌గా ఎన్నికైన తొలి తెలుగు మహిళ 

షోలాపూర్‌(మహారాష్ట్ర): షోలాపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ) మేయర్‌గా ఎన్నికైన తొలి తెలుగు మహిళ యెన్నం కాంచనకు కరోనా సోకింది. ఆమెతోపాటు భర్త యెన్నం రమేశ్‌కు కూడా కరోనా సోకినట్టు శుక్రవారం వైద్యాధికారులు ధ్రువీకరించారు. దీంతో మేయర్‌ దంపతులను ఆస్పత్రికి తరలించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా సదాశివపేటకు చెందిన కాంచన 2019 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో షోలాపూర్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. మేయర్‌ దంపతులిద్దరికీ కరోనా సోకడంతో వారు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని అధికారులు శానిటైజ్‌ చేశారు. చదవండి: షోలాపూర్‌ మేయర్‌గా తెలుగు మహిళ 

లాక్‌డౌన్‌ సమయంలో ఆమె ఎక్కడెక్కడ పర్యటించారు.. ఎవరెవరిని కలిశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి రాగానే కరోనాపై అవగాహన కల్పించేందుకు ఆమె పలు చోట్ల పర్యటించారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులు, క్వారంటైన్, కంటైన్మెంట్‌ ప్రాం తాల్లోనూ తిరిగారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా ఆమె అస్వస్థతకు గురికావడంతో పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె భర్త, వెంట తిరిగిన పలువురు ఉద్యోగులు, అధికారులకు కరోనా పరీక్షలు నిర్వహిం చారు. అందులో ఆమె భర్తకు మినహా మిగతా వారికి నెగెటివ్‌ వచ్చింది. చదవండి: గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే! 

మరిన్ని వార్తలు