ఎస్‌బీఐ ఉద్యోగికి కరోనా: కార్యాలయం మూసివేత

8 May, 2020 16:45 IST|Sakshi

ఎస్‌బీఐకి పాకిన కరోనా వైరస్

కోలకతాలో ఎస్‌బీఐ ఉద్యోగికి కరోనా పాజిటివ్ 

కార్యాలయంలో ఒక  విభాగం మూసివేత

సాక్షి, కోలకతా: దేశీయ అతిపెద్ద  ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను కరోనా వైరస్ ప్రకంపనలు తాకాయి. కోల్‌కతాలోని ఒక ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ప్రధాన కార్యాలయంలోని ఒక విభాగాన్ని ఎస్‌బీఐ మూసివేసింది. స్థానిక ప్రధాన కార్యాలయానికి చెందిన ఇ-వింగ్ ఉద్యోగిగా బాధితుడిని సంస్థ ప్రకటించింది. స్థానిక  ప్రైవేట్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడని  తెలిపింది. 

వైరస్ సోకిందని గుర్తించక ముందే  సదరు ఉద్యోగి గత పది రోజులుగా సెలవులో ఉన్నాడని బ్యాంకు అధికారి వెల్లడించారు. కోవిడ్-19 పాజిటివ్  వచ్చిన వెంటనే మొత్తం భవనాన్ని శుభ్రపరిచి, మే 11వ తేదీ వరకు ఈ విభాగాన్ని మూసివేశామని తెలిపింది. అయితే ఈ భవనంలోని మిగతా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయని చెప్పింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన సంస్థగా ఉద్యోగుల సంక్షేమాన్ని పరిశీలిస్తూ, అన్ని నిబంధనలను అనుసరిస్తున్నామని అధికారి తెలిపారు. గతంలో విదేశాలకు వెళ్లిన మరొకరికి కూడా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.(ఎస్‌బీఐ గుడ్ న్యూస్‌, వారికి ప్రత్యేక పథకం)

మరోవైపు  ఎస్‌బీఐ  పనిచేస్తున్న ఉద్యోగి (48)కి.  ఆమె కుమార్తె(28)కు పాజటివ్ గా తేలడంతో పంజాబ్  లోని పాటియాలా నగరంలో ఎస్‌బీఐ  రెండు శాఖలు మూసివేసినట్టు సమాచారం. వీరిని క్వారంటైన్ లో ఉంచామని పాటియాలా సివిల్ సర్జన్ డాక్టర్ హరీష్ మల్హోత్రా తెలిపారు. అలాగే ఈ శాఖలను సందర్శించిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. మే 8, ఉదయం 8 గంటల వరకు పశ్చిమ బెంగాల్‌లో  కరోనా కారణంగా 151 మరణాలు సంభవించగా, 1548 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక మరణాల నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో బెంగాల్‌ ఒకటి.  (అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు లాంచ్ )

మరిన్ని వార్తలు