భారత్‌: 9 లక్షలు దాటిన కరోనా కేసులు

14 Jul, 2020 09:54 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ ఉధృతి వేగంగా విస్తరిస్తోంది.  దేశంలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాటికి 9 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశంలో 28 వేల కేసులు నమోదవ్వడం ఇది వరుసగా మూడో రోజు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 9, 07,645కు చేరింది. ఒక్క రోజులో 540 మంది వైరస్‌తో పోరాడి మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 23,727కు చేరింది. మహారాష్ట్రలో నిన్న(సోమవారం) 6,497 కేసులు నమోదవ్వగా మొత్తం కేసులు 2,60,924 నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో కొత్తగా 1,246 మంది కరోనా బారిన పడగా మొత్తం 1,42,000 నమోదయ్యాయి. (త్వరలో శుభవార్త అందించబోతున్నాం: ట్రంప్‌)

కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 3,363,056 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 1,884,967 కేసులతో  బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం నాటికి 13 మిలియన్ల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 5,72000 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు కఠిన నియమాలు పాటించకపోతే మహమ్మారి పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. (ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్లకు బ్రేక్‌!)

మరిన్ని వార్తలు