భారత్‌: 24 వేలు దాటిన కరోనా మరణాలు

15 Jul, 2020 09:32 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ను కరోనా వైరస్‌ వణికిస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా కేసులు  కనివినీ ఎరుగని రీతిలో నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య నిత్యం పెరుగుతుండటంతో యావత్‌ దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దాదాపు 30 వేలకు చేరువగా కేసులు వెలుగు చూడటంతో దేశంలో కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. మంగళవారం కొత్తగా 29,429 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బయటపడినప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటి సారి.

దేశంలో ఇప్పటి వరకు 9,36,181 మంది కరోనా బారిన పడ్డారు.దేశంలో కరోనా మరణాల సంఖ్య 24 వేటు దాటింది. ఒక్కరోజే 582 మంది మృత్యువాతపడటంతో మొత్తం మరణాల సంఖ్య 24,309కు చేరింది. ప్రస్తుతం 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉండగా,  5,92,031 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో రికవరీ రేటు 63.02 శాతంగా ఉంది. (కరోనా పరీక్షల కోసం ప్రత్యేక బస్సు)

మరిన్ని వార్తలు