త్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌

24 May, 2020 20:16 IST|Sakshi

వ్యాక్సిన్ల అభివృద్ధి వేగవంతం

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో అభివృద్ధి చేస్తున్న 14 కరోనా వ్యాక్సిన్లలో 4 వ్యాక్సిన్లు అతిత్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకుంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు. బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహరావుతో ఆయన చేపట్టిన సోషల్‌ మీడియా ఇంటరాక్షన్‌లో ఈ వివరాలు తెలిపారు. ఐదు నెలల్లో భారత్‌లో నాలుగు కరోనా వ్యాక్సిన్లు కీలక దశకు చేరుకుంటాయని చెప్పారు.

కోవిడ్‌-19కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయని, దాదాపు 100కు పైగా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్‌ రూపకల్పన ప్రయత్నాలను సమన్వయపరుస్తోందని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశంలో 6767 తాజా కేసులు వెలుగుచూడగా 147 మంది మరణించారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో 1,31,920కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

చదవండి : వ్యాక్సిన్‌ వచ్చాకే టోర్నమెంట్లు

మరిన్ని వార్తలు