విదేశీ ప్రయాణమే కొంపముంచిందా?

22 Mar, 2020 11:18 IST|Sakshi

భారత్‌ నుంచి పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రయాణాలు

2008లో విదేశాల నుంచి వచ్చిన 52 లక్షల మంది..

2018లో 1.74 కోట్ల మంది రాక..

2009లో 1.1 కోట్ల మంది వెళ్లగా, 2018లో 2.6 కోట్ల మంది విదేశాలకు

అంతర్జాతీయ ప్రయాణాల్లో చైనా, ఇటలీనే టాప్‌..

కోవిడ్‌ విస్తృత వ్యాప్తికి ఇదే కారణం

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచం కుగ్రామం కావడం కరోనా వైరస్‌కు కలిసొచ్చింది. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు స్వాభిమానం ఎక్కువున్న ఈ వైరస్‌.. ఆహ్వానించగానే అంతర్జాతీయ ప్రయాణికుల ఒడిలో చేరింది. మన దేశంలోనూ అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరగడంతో వారి ద్వారా సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చి భయాందోళనలకు గురిచేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణిలకు సంఖ్యను పరిశీలిస్తే గత పదేళ్లలో ఇతర దేశాల నుంచి దేశంలోకి వచ్చిన వారి సంఖ్య మూడింతలు పెరిగింది. చదవండి: వందేళ్లకో మహమ్మారి..

అధికారిక లెక్కల ప్రకారం 2008లో ఇతర దేశాల నుంచి మన భూభాగంపై అడుగు పెట్టిన వారు 52 లక్షల మంది అయితే, 2018లో ఏకంగా అది 1.74 కోట్లకు చేరింది. దీంతోపాటు మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారు 2009లో 1.1 కోట్లుగా నమోదైతే, 2018లో ఆ సంఖ్య 2.6 కోట్లకు చేరింది. ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారానే మన దేశంలోకి కోవిడ్‌ మహమ్మారి అడుగుపెట్టడం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది విదేశీ ప్రయాణికుల ద్వారానే ఇతర దేశాలకు పాకింది. చైనాలోని వుహాన్‌ పట్టణంలో పుట్టిన ఈ వైరస్‌ విమానాల్లో ప్రయాణించి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనా, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా, ఇటలీ, హాంకాంగ్, జర్మనీ, లండన్‌ తదితర దేశాలు అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అగ్రభాగాన నిలవగా, అందులోని మెజారిటీ దేశాలు కోవిడ్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు