కోవిడ్‌పై పోరాటానికి అండగా నిలవండి

28 Mar, 2020 19:34 IST|Sakshi

న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూత ఇవ్వాలని దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన నిధులు సేకరణ కోసం.. ప్రధానమంత్రి పౌర సహాయ, ఉపశమన అత్యవసర పరిస్థితుల నిధి(పీఎం-కేర్స్‌)ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కోవిడ్‌-19పై పోరాటానికి అండగా నిలబడాలనుకునే వారు పీఎం-కేర్స్‌కు విరాళాలు అందించాలని కోరారు. ఆరోగ్యకర దేశాన్ని తయారు చేసేందుకు ఈ నిధిని వినియోగిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొవడానికి కూడా ఈ నిధిని ఉపయోగిస్తామన్నారు. తక్కువ విరాళాలను కూడా తీసుకుంటామని వెల్లడించారు. విపత్తు నివారణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ప్రజలను కాపాడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. ఆరోగ్యకరమైన, శ్రేయస్కరమైన దేశాన్ని భవిష్యత్తు తరాలకు అందించే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. (కరోనాపై పోరు: టాటా ట్రస్ట్‌ కీలక ప్రకటన!)

పీఎం-కేర్స్‌ ట్రస్ట్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని కేంద్ర సమాచార వెల్లడించింది. ట్రస్ట్‌ సభ్యుల్లో హోం, రక్షణ, ఆర్థిక మంత్రులు కూడా ఉంటారని తెలిపింది. విరాళాలు అందించే వారి కోసం వివరాలు వెల్లడించింది. ఈ కింద ఉన్న వివరాలు ఆధారంగా దాతలు విరాళాలు ఇవ్వొచ్చు.

మరిన్ని వార్తలు