రాష్ట్రాల వారిగా కరోనా కేసులు

28 Mar, 2020 20:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మన దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. అగ్రదేశాలతో పోలిస్తే మన దేశంలో కోవిడ్‌ వ్యాప్తి తక్కువగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టడంతో కరోనా విస్తృతి నెమ్మదించింది. శనివారం సాయంత్రం 5.45 గంటల సమయానికి మన దేశంలో  862 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 47 మంది విదేశీయులు ఉన్నట్టు వెల్లడించింది. కరోనా సోకి ఇప్పటివరకు దేశంలో 19 మంది మరణించినట్టు తెలిపింది. కాగా, తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో కలుపుకుంటే మరణాల సంఖ్య 20కి చేరుతుంది.

కరోనా పాజిటివ్‌ కేసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారిగా చూసుకుంటే మహారాష్ట్రలో 177, కేరళలో 168, కర్ణాటకలో 55,  ఉత్తరప్రదేశ్‌లో 54, రాజస్థాన్‌లో 52, తెలంగాణలో 46, గుజరాత్‌లో 44, ఢిల్లీలో 38, పంజాబ్‌లో 38, తమిళనాడులో 34,  మధ్యప్రదేశ్‌లో 30, జమ్మూ కశ్మీర్‌లో 20, హరియాణాలో 19, పశ్చిమ బెంగాల్‌లో 15, ఆంధ్రప్రదేశ్‌లో 14, లదాఖ్‌లో 13, బిహార్‌లో 9 నమోదయ్యాయి. కోవిడ్‌ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 80 మంది కోలుకున్నారు. (కోవిడ్‌పై పోరాటానికి అండగా నిలవండి)

మరిన్ని వార్తలు