21 మంది నావికులకు కరోనా పాజిటివ్‌

18 Apr, 2020 09:27 IST|Sakshi

ఇండియన్‌ నేవీలో కరోనా కలకలం

ముంబై: భారత నావికాదళంలో కరోనా కలకలం రేపింది. 21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. వారందరినీ నగరంలోని ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావల్‌ బేస్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఏప్రిల్‌ 7 న కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అతని ద్వారానే తాజాగా మిగతా వారికి కరోనా వ్యాప్తి జరిగినట్టు నేవీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నేవీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ అంగ్రేను లాక్‌డౌన్‌ చేశారు.
(చదవండి: చైల్డ్‌ లైన్‌కి 4.6 లక్షల ఫోన్‌కాల్స్‌)

మిగతా సిబ్బందికి కరోనా వ్యాపించకుండా భారత నావికాదళం చర్యలు తీసుకుంటోంది. బాధిత సెయిలర్లు ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నది తేలాల్సి ఉంది. భారత త్రివిధ దళాలకు కరోనా వ్యాప్తి చెందలేదు అనుకునే లోపే.. ఇండియన్‌ ఆర్మీలో 8 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఇండియన్‌ నేవీలో ఏకంగా 21 మందికి మహమ్మారి  సోకింది. కాగా, 3,205 కేసులతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,835 కు చేరుకుంది. వారిలో 452 మంది ప్రాణాలు విడువగా.. 1766 మంది కోలుకున్నారు.

>
మరిన్ని వార్తలు