'కరోనాను ఎమర్జెన్సీగా ప్రకటించండి'

4 Mar, 2020 18:13 IST|Sakshi

ఢిల్లీ : దేశంలోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్న కోవిడ్‌-19ను కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ గురించి బయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రసుత్తం ఉన్న పరిస్థితులను ఎమర్జెన్సీగా భావించి టాస్క్‌ఫోర్స్‌ విభాగం పనిచేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు లేడీ హార్డింగ్‌ ఆసుపత్రి, ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో కరోనాకు సంబంధించి ప్రత్యేక పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా కరోనా సోకిన వ్యక్తితో పాటు అతనితో వచ్చిన 88 మందిని అధికారులు గుర్తించారని, వారందరికి కరోనాకు సంబంధించిన స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.  ​కాగా ఇప్పటివరకు ఇండియాలో 28 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ ప్రకటించారు.
('ముద్దులకు దూరంగా ఉండాల్సిందే!')

(కరోనా ఎఫెక్ట్‌ : హోలీకి వారు దూరం)

మరిన్ని వార్తలు