ఒక్కరోజే 26,506 పాజిటివ్‌ కేసులు

10 Jul, 2020 10:56 IST|Sakshi

సరికొత్త రికార్డు

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య సరికొత్త శిఖరాలకు చేరుతోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం అత్యధికంగా 26,506 తాజా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకూ కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8,00,000కు చేరువగా 7,93,802కు ఎగబాకింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 475 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 21,604కు పెరగ్గా, కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,95,513కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం 2,76,685 యాక్టివ్‌ కేసులున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇక గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 17,000కు పైగా తాజా కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్‌ కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఈ కేసుల్లో 80 శాతం కేవలం 49 జిల్లాల్లోనే ఉండటం గమనార్హం.
చదవండి: ఆ వ్యక్తికి నెగిటివ్‌.. పాజిటివ్‌ వస్తుందనే భయంతో..

మరిన్ని వార్తలు