చేతుల్లేకి కోతికి అరటి పండు తినిపించిన పోలీసు

18 Apr, 2020 14:40 IST|Sakshi

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరూ బయటకి రాకపోవడంతో వీధుల్లో తిరిగే జంతువులకు ఆహారం లేకుండా పోయింది. దీంతో కొంతమంది జంతూ ప్రేమికులు తమకు అందుబాటులో ఉన్న జంతువుల కడుపు నింపేందుకు ప్రయత్నిస్తు​న్నారు. మూగ జీవుల ప్రాణాలు కాపాడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చేతుల్లేని ఓ కోతికి ఓ పోలీసు అరటి పండు వొలిచి తినిపించి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో జరిగింది. 

ఈ వీడియోని కుష్బు సోనీ అనే మహిళ ట్వీట్‌ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. పోలీస్ స్టేషన్ ముందు మాస్క ధరించి కుర్చున్న పోలీస్.. ఆయన పక్కనే ఉన్న చేతులు లేని కోతికి అరటి పండు తినిపిస్తూ.. దాని ఆకలి తీర్చాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై పలువురు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ‘చేతులు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కోతి ఆకలి తీర్చిన మీకు హ్యాట్సాఫ్’, ‘ఆ పోలీసు పేరు కోసం ఇలాంటి సహాయం చేయలేదు. జన్యూన్‌గా చేశాడు’, ‘ఇలాంటి పోలీసులు ఉండడం మన అదృష్టం’, ‘మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇది’  అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు