సీఆర్పీఎఫ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ మూసివేత

3 May, 2020 12:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఆర్పీఎఫ్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో హెడ్‌ క్వార్టర్స్‌ను అధికారులు ఆదివారం సీలు వేశారు. శానిటేషన్‌ కోసం బెటాలియన్‌ కార్యాలయాన్ని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ భవనంలోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు ట్రూపర్లకు కరోనా సోకిగా, ఈ బెటాలియన్‌కు చెందిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇటీవలే కరోనాతో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా 39,000మంది కరోనా బారినపడిగా 1300మంది మరణించారు. (సీఆర్పీఎఫ్‌‌: 122 మంది జవాన్లకు కరోనా)

మరిన్ని వార్తలు