భారత్‌లో 17 వేలు దాటిన కరోనా కేసులు

20 Apr, 2020 10:28 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,553 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 36 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 17,265కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 2,546 మంది డిశ్చార్జ్‌ కాగా, 543 మంది మృతిచెందారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 14,175 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. 

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 4,203 కరోనా కేసులు నమోదు కాగా, 223 మంది మృతిచెందారు. ఆ తర్వాత ఢిల్లీలో 2,003, గుజరాత్‌లో 1,743, మధ్యప్రదేశ్‌లో 1,407, రాజస్తాన్‌లో 1,478 , తమిళనాడులో 1,477, ఉత్తరప్రదేశ్‌లో 1,084 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కేరళలో 402 మందికి కరోనా సోకగా.. అందులో 270 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మగ్గురు మృతిచెందారు. 

మరిన్ని వార్తలు