దేశంలో 400 దాటిన కరోనా మరణాలు..

16 Apr, 2020 09:09 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకి విజృంభిస్తోంది. గురువారం ఉదయం వరకు భారత్‌లో 12,380 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 1,489 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. 414 మంది మృతిచెందారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10,477 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,916 కరోనా కేసులు నమోదుకాగా, 187 మంది మృతిచెందారు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో కూడా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. 

అయితే దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో మాత్రం.. పరిస్థితుల్లో చాలా మార్పు కనిపిస్తోంది. అక్కడ కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు సత్ఫలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేరళలో ఇప్పటివరకు 388 కరోనా కేసులు నమోదుకాగా, అందులో 218 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతిచెందారు. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 650, ఆంధ్రప్రదేశ్‌లో 525 కరోనా కేసులు నమోదయ్యాయి. 

చదవండి : ‘లాక్‌డౌన్‌’ ఆంక్షలు.. సడలింపులు..

మన గబ్బిలాల్లో కరోనా లేదు

మరిన్ని వార్తలు