ఇక ఐఐటీల్లోనూ ఆన్‌లైన్‌ పాఠాలు!

16 Jun, 2020 03:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఐఐటీల్లో ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించేందుకు ఐఐటీ కౌన్సిల్‌ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్, కౌన్సెలింగ్‌ అనంతరం సెప్టెంబర్‌ ఆఖరు లేదా అక్టోబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే వీలుంది. ఇక ఇతర సెమిస్టర్‌ విద్యార్థులకు తరగతులను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించేందుకు ఐఐటీల కౌన్సిల్‌ కసరత్తు ప్రారంభించింది. ఒక సెమిస్టర్‌ పాటు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు చేస్తోంది. అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే ఈ ఏడాది చివరి వరకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇందుకు ఐఐటీల కౌన్సిల్‌ గతవారం సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు