కరోనా నియంత్రణకు కేంద్రం బృహత్తర ప్రణాళిక

6 Apr, 2020 11:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 4,067 కరోనావైరస్‌ పాటిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 109 కు చేరింది. గడిచిన 12 గంటల్లోనే ఏకంగా 490 మందికి కరోనా వైరస్‌ సోకింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళతో సహా 9 రాష్ట్రాల్లోని 211 జిల్లాలలో కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్దం చేసింది. కరోనావైరస్‌ మరిన్ని ప్రాంతాలకు కరనా విస్తరించే ప్రమాదం పొంచి ఉందనే అంచనాతో కేంద్ర ఆరోగ్య శాఖ వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించింది. (చదవండి : భారత్‌లో 4వేలు దాటిన కరోనా కేసులు)

కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికలోని ముఖ్యాంశాలు

ప్రస్తుతం పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో జన సంచారం లేకుండా చేయడం.

ఆయా ప్రాంతాలకు పూర్తిగా రాకపోకల రద్దు కొనసాగింపు.

చివరి కరోనా  కేసు నమోదైన తర్వాత 4 వారాల వరకు.. కొత్తగా ఎలాంటి పాజిటివ్ కేసు నమోదు కానట్లయితే అప్పుడు మాత్రమే ఆయా ప్రాంతాలలో నెమ్మదిగా సడలింపు.

పాజిటివ్ కేసులుగా నమోదైన వారినందరినీ ఆస్పత్రులకు తరలింపు

రెండు సార్లు జరిపే రక్త పరీక్షలు నెగటివ్‌గా వస్తేనే ..పేషెంట్లను ఆసుపత్రుల నుంచి ఇళ్లకు పంపాలి

కొద్దిపాటి కరనా లక్షణాలు ఉన్న వాళ్లను..స్టేడియంలలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాలకు పంపాలి

కొంచెం ఎక్కువ కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను..అసుపత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులలో ఉంచాలి

కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను దిగ్బంధం చేయడంతో పాటు ఆ ప్రాంతాల నుంచి పక్క ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందకుండా అంచెల వారి  రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి

పాఠశాలలు, కళాశాలలు, ఇతర కార్యాలయాలను చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మూసివేయాలి.

 ►ఈ ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా ను స్తంభింప చేయాలి

కేవలం నిత్యావసర, అత్యవసర సర్వీసులను మాత్రం అనుమతించాలి

కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో..వివిధ విధానాలను అవలంబించాలి

వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి కట్టుదిట్టమైన సర్జికల్ గౌన్లు,  మాస్కులు, గ్లోవ్స్ లాంటి ..మూడు రకాలైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు వినియోగించాలి

కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్లు గా గుర్తించాలి

ఖచ్చితమైన చర్యలు తీసుకునే బాధ్యతను ..సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్లకు అప్పగించాలి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు