కరోనా ఎఫెక్ట్‌.. బెంగళూరులో ఇన్ఫోసిస్‌ భవనం ఖాళీ

14 Mar, 2020 12:12 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కరోనావైరస్‌ సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్ని ఖాళీ చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కొంత మంది సభ్యులకు కరోనా సోకినట్లు అనుమానం కలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్‌మెంట్‌ సెంటర్‌ హెడ్‌ గురురాజ్‌ దేశ్‌పాండే పేర్కొన్నారు. 
(చదవండి : కరోనా ఎఫెక్ట్‌..అమెరికా కాన్సులేట్‌ కీలక నిర్ణయం)

‘సంస్థలోని ఓ ఉద్యోగికి కరోనా వ్యాపించిందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఐఐటీఎం భవనం ఖాళీ చేస్తున్నాం. మన ఉద్యోగుల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీరు గుర్తించాలి. కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీరేమీ ఆందోళన చెందవద్దు. కరోనా వ్యాప్తి గురించి ఎలాంటి పుకార్లు అవాస్తవాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటిని నమ్మకండి.. ప్రచారం చేయకండి. మీరు బాధ్యతాయుతంగా మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’  అని ఉద్యోగులకు దేశ్‌పాండే మెయిల్ చేశారు. కరోనా వైరస్‌ నుంచి దూరంగా ఉండడానికి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోవ్‌ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం అన్ని ఐటీ, బయోటెక్‌ కంపెనీలకు ఆదేశించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు