72 గంటలపాటు పార్శిల్స్‌ తాకొద్దు!

11 May, 2020 17:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా లాంటి ప్రాణాంతక వైరస్‌ల బారిన పడకుండా ఉండాలంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా తెప్పించుకునే అన్‌లైన్‌ ప్యాకేజీలను 72 గంటలపాటు తెరవకుండా ఉండాలని బాత్, బిస్టల్, సౌతాంప్టన్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు. స్వైన్‌ ఫ్లూ విజంభించిన రోజుల్లో ఈ సూచనలను పాటించడం సత్ఫలితాలను ఇచ్చిందని వారు చెబుతున్నారు.  (మూడు విడతలుగా లాక్డౌన్ ఎత్తివేత)

ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌పైన కరోన వైరస్‌ 72 గంటలు, రాగిపై ఎనిమిది గంటలు, కార్డ్‌బోర్డ్‌పై నాలుగు గంటలపాటు బతికి ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే కనుక్కోవడం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీలు ఎక్కువగా ప్యాకేజీల కోసం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తుండడంతో పరిశోధకులు ఈ 72 గంటల సూచనను తీసుకొచ్చినట్లున్నారు. ఈ సూచనను తప్పకుండా పాటించాల్సిందిగా ప్రజలకు బ్రిటీష్‌ ప్రభుత్వ వెబ్‌సైట్‌ పిలుపునిచ్చింది. వాస్తవానికి ఇది అన్ని దేశాల ప్రజలకు వర్తిస్తుంది. (ప్లాస్టిక్ కవర్లలో శవాలు.. పక్కనే పేషెంట్లు)

మరిన్ని వార్తలు