ఇక ‘ఆరోగ్య సేతు’  బాధ్యత యాజమానులకు

8 Jun, 2020 15:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం విధించిన ఐదవ దశ లాక్‌డౌన్‌ను జూన్‌ 8వ తేదీ నుంచి సడలించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఉద్యోగులు చేత అమలు చేయించాల్సిన బాధ్యతను యాజమాన్యాలకు అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ యాప్‌ను ఉపయోగిస్తోన్న వినియోగదారుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఆ వ్యక్తి ఎవరెవరిని కలుసుకున్నారో తెలుసుకునేందుకు ఆరోగ్యసేతు యాప్‌ను ‘నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌ సెంటర్‌’ అభివృద్ధి చేసింది. అంతేకాకుండా వినియోగదారుడు తన చుట్టుపక్కల కరోనా రోగి ఉన్నట్లయితే ఆ విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ఈ యాప్‌ దోహదపడుతుంది. (సాహో.. ఆరోగ్య సేతు..!)

విమానాల్లో, రైళ్లలో ప్రయాణించేవారు ఈ యాప్‌ను విధిగా డౌన్‌లోడ్‌ చేసుకొని తీరాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ యాప్‌ను అమలు చేయడం అంటే వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన గోప్యతకు ముప్పు వాటిల్లినట్లేనని సామాజిక కార్యకర్తలు భావిస్తున్నారు. వ్యక్తిగత వివరాల భద్రతకు సంబంధించి ఇప్పటి వరకు సరైన చట్టమంటూ లేకపోవడమే తమ ఆందోళనకు కారణమని వారు చెబుతున్నారు. ‘భారత వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్‌19’ ఇప్పటికీ మోక్షం లేకపోవడమే వారి ఆందోళనకు కారణం.  (ఆరోగ్య సేతుభద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ)

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులచేత ఈ యాప్‌ను విధిగా ఉపయోగించేలా చేయాలనేది కేంద్రం లక్ష్యం. ఆ విషయాన్ని విఫులంగా చెప్పకుండా ఈ బాధ్యతను యాజమాన్యాలకు అప్పగిస్తున్నట్లు మాత్రమే కేంద్రం ప్రకటించింది. ఇలా యాజమాన్యాల చేత ఉద్యోగలపై ఒత్తిడి తీసుకరావడం మంచిది కాదని, ఈ విషయంపై తాము కోర్టులను ఆశ్రయిస్తామని సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. (ఇకపై యాప్లో రిజిస్టర్ అయ్యాకే..)

మరిన్ని వార్తలు