కోవిడ్‌.. మరో రికార్డు

1 Jun, 2020 06:32 IST|Sakshi

ఒక్కరోజులో 8,380 కొత్త కేసులు

మొత్తం 1,82,143 కేసులతో ప్రపంచంలో 9వ స్థానం

న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 8,380 మంది కోవిడ్‌–19 బారినపడినట్టు తేలడంతో బాధితుల సంఖ్య 1,82,143కు చేరుకుంది. అదేవిధంగా, ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,164 మంది మృతి చెందారని కేంద్రం తెలిపింది. కేసుల సంఖ్య రీత్యా ప్రపంచంలోనే తొమ్మిదో స్థానంలో భారత్‌ నిలిచింది. దేశంలో కోవిడ్‌–19 యాక్టివ్‌ కేసులు 89,995 కాగా మొత్తం 86,983 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

దీంతో రికవరీ రేటు 47.76 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 193 మంది కరోనా బారిన పడి చనిపోగా వీరిలో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 99 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌(27), ఢిల్లీ(18), మధ్యప్రదేశ్, రాజస్తాన్‌(9)లు, పశ్చిమబెంగాల్‌(7), తమిళనాడు(6) ఉన్నాయి. దీంతోపాటు, మొత్తం కోవిడ్‌–19 మృతులు 5,164 కాగా, ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 2,197 మంది ఉన్నారు. 

మరిన్ని వార్తలు