కరోనా : దయనీయంగా డబ్బావాలాల పరిస్థితి

9 Apr, 2020 15:43 IST|Sakshi

ముంబై : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ దేశంలో కూడా రోజురోజుకు మరింత ఉదృతమవుతుంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు అక్కడ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావంతో వాణిజ్య రాజధాని అయిన ముంబైలో డబ్బావాలతో సర్వీస్‌తో వేల మందికి టిఫిన్స్‌ అందించే ఉపాధిని కోల్పోయారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రోజుకు సుమారు లక్షకు పైగా కస్టమర్లకు టిఫిన్‌లను అందిస్తూ డబ్బావాలాలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటారు. కరోనా ప్రభావంతో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. (క‌రోనా : పాకిస్తాన్‌లో ఒక్క‌రోజే 248 కొత్త కేసులు)

దేశంలో ఫుడ్‌ డెలివరీ అందించే ఉబెర్‌ ఈట్స్‌, ఇతర సంస్థల్లాగా డబ్బావాలాలు ఎక్కడో హోటల్‌ నుంచి తెప్పించే టిఫిన్లను తమ కస్టమర్లకు అందించరు. వారే స్వయంగా వండుకొని వెళ్లడమో లేక ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి వారింట్లో వండిన ఆహారాన్ని లంచ్‌ సమయంలో రిక్షాలో పెట్టుకొని ముంబైలో ఉద్యోగులు పనిచేసే చోటుకు తీసుకొని వస్తారు. ఇలా రోజుకు దాదాపు 2 లక్షల మందికి లంచ్‌ అందించేలా వారానికి ఆరు రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అయితే గత 130 ఏళ్లుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్న డబ్బావాలాలకు ఎప్పుడు ఇంత కష్టం రాలేదు. కరోనా పుణ్యమా అని వ్యాపారం సరిగా లేకపోవడంతో వారంతా రోడ్డు పాలయ్యారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ నిర్వహిస్తుంది. కాగా ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసే ఆలోచన లేదని ప్రధాని మోదీ తెలిపారు. దీంతో డబ్బావాలా కార్మికుల కష్టాలు ఇప్పట్లో తొలిగేలా కనిపించడం లేదు. కరోనా జోరుగా విస్తరిస్తోన్న మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలు లేకపోవడంతో డబ్బావాలల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది.  ప్రభుత్వం ఏమైనా సాయమందిస్తుందేమేనని డబ్బావాలలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రజలు ఎవరైనా సరే మాస్కులు లేకుండా బయటికి వస్తే అరెస్టు చేయాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే బుధవారం పోలీసులను ఆదేశించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు 5వేలకు పైగా నమోదవ్వగా, మృతుల సంఖ్య 166కు చేరుకుంది.
(లాక్‌డౌన్‌: ఒడిశా కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు