కరోనా: ఆ రాష్ట్రంలో అందరూ కోలుకున్నారు!

19 Apr, 2020 20:13 IST|Sakshi

పనాజి: దేశవ్యాప్తంగా కరోనా అంతకంతకూ విస్తరిస్తున్న వేళ గోవా రాష్ట్రం మంచి వార్త చెప్పింది. రాష్ట్రంలో నమోదైన 7 పాజిటివ్‌ కేసుల బాధితులు కోలుకున్నారని, ఇప్పుడు యాక్టివ్‌ కేసులు ఒక్కటి కూడా లేదని ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఆదివారం వెల్లడించారు. ఏడుగురిలో ఇప్పటికే ఆరుగురు కోవిడ్‌ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్‌ అయ్యారని, మరో వ్యక్తి కూడా ఆదివారం డిశ్చార్చ్‌ అయ్యారని సీఎం తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. బాధితులకు పలుమార్లు పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయని తెలిపారు.
(చదవండి: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు)

అయితే,  మొత్తం ఏడుగురిని మరికొన్ని రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతామని అన్నారు. బాధితులకు సేవలందించిన వైద్యులకు, లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేస్తున్న పోలీసులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. తమ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు లేవని, గోవాను గ్రీన్‌ జోన్‌గా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. పాజిటివ్‌ కేసులు లేకపోయినప్పటికీ ప్రజలు లాక్‌డౌన్‌ పాటించి.. ఇళ్లకే పరిమితం కావాలని సీఎం కోరారు. కాగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 758 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు.
(చదవండి: ఒక్కసారి కూడా దగ్గు రాకపోతే?)

మరిన్ని వార్తలు