క‌రోనా మృత‌దేహాల‌ను ప‌ట్టించుకోరా?: సుప్రీంకోర్టు

12 Jun, 2020 14:33 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా క‌రోనా బాధితులు, క‌రోనా మృత‌దేహాల ప‌ట్ల ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రులు అనుస‌రిస్తున ‌తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర‌ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. క‌రోనా పేషెంట్ల‌ను జంతువుల క‌న్నా హీనంగా చూస్తున్నార‌ని వ్యాఖ్యానించింది. మృ‌తదేహాల‌కు క‌నీస మ‌ర్యాద ఇవ్వ‌డం లేద‌ని పేర్కొంది. క‌రోనా పేషెంట్లు చ‌నిపోతే క‌నీసం వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా స‌మాచార‌మివ్వడం లేద‌ని ఆగ్ర‌హించింది. వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన వ్య‌క్తి మృ‌తదేహం చెత్త‌కుప్ప‌లో వెలుగు చూసిన ఘ‌ట‌నపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. (‘వారిని చంపింది కరోనా కాదు’)

కాగా శుక్ర‌వారం భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం కోవిడ్ పేషెంట్ల‌పై ఆసుప‌త్రులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, అంత్య‌క్రియ నిర్వ‌హ‌ణ‌పై విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో ప‌రిస్థితి మ‌రింత అధ్వాన్నంగా ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఓవైపు కేసులు పెరిగిపోతుంటే ఢిల్లీలో కోవిడ్ ప‌రీక్ష‌లు త‌గ్గించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించింది. వీట‌న్నింటిపైనా ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పూర్తి నివేదిక‌ అంద‌జేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. కాగా దేశంలో క‌రోనా మ‌రింత విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌పంచంలో కరో‌నా తీవ్ర‌త అధికంగా ఉన్న బ్రిట‌న్‌ను దాటి నాలుగో స్థానానికి పాకింది. ప్ర‌స్తుతం దేశంలో 2,97,535 కేసులు న‌మోద‌య్యాయి. (24 గంటల్లో10,956 కేసులు .. 396 మరణాలు)

మరిన్ని వార్తలు