ఢిల్లీలోని యూఎస్ ఎంబ‌సీలో కోవిడ్ క‌ల‌క‌లం

3 Apr, 2020 18:27 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలోని అమెరికా రాయ‌బార కార్యాల‌యంలో కోవిడ్‌-19(క‌రోనా వైర‌స్‌) క‌ల‌క‌లం రేగింది. యూఎస్ ఎంబసీ అధికారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా శుక్ర‌వారం పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో భార‌త వైద్యాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అత‌నికి చికిత్స అందిస్తున్న‌ట్లు ఆ కార్యాల‌య ప్ర‌తినిధి ఒక‌రు పేర్కొన్నారు. క‌రోనా సోకిన వ్య‌క్తి భార‌తీయుడా, అమెరికా సంత‌తి పౌరుడా అన్న విష‌యాన్ని వెల్ల‌డించేందుకు ఆయ‌న‌ నిరాక‌రించారు. అయితే త‌మ కార్యాల‌యంలో పని చేసే అమెరికా పౌరులైనా, స్థానిక వ్య‌క్తులైనా వారి ర‌క్ష‌ణే త‌మ ముందున్న ప్ర‌ధాన బాధ్య‌త‌గా అభివ‌ర్ణించారు. మ‌రోవైపు అధికారులు అత‌నితో స‌న్నిహితంగా మెదిలిన వ్య‌క్తుల వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు 219  క‌రోనా కేసులు న‌మోదు కాగా న‌లుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. (శాంతా, ఎట్లున్నవ్‌? తింటున్నవా?)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు