న‌ర్సుల‌తో అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌: ఆ చ‌ట్టం ప్ర‌యోగం

3 Apr, 2020 19:19 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: ప్ర‌జ‌ల ప్రాణాలు ర‌క్షించ‌డ‌మే త‌మ క‌ర్త‌వ్యంగా వైద్యులు భ‌యంక‌ర‌మైన క‌రోనా శత్రువుతో పోరాడుతున్నారు. ఈ పోరాటానికి వారికి చేయెత్తి న‌మ‌స్క‌రించాల్సింది పోయి క‌నీస సంస్కారం లేకుండా దాడుల‌కు దిగుతూ, దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న ఘ‌ట‌న‌లు స‌భ్య స‌మాజాన్ని త‌ల దించుకునేలా చేస్తున్నాయి. పైగా దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెర‌గ‌డానికి మూల కార‌ణంగా భావిస్తున్న‌ త‌బ్లిగి జ‌మాత్ స‌భ్యులే ఈ దాడుల‌కు దిగ‌డం శోచ‌నీయం. వీరి ఆగ‌డాల‌పై ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌న్నెర్ర చేసింది. (‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్‌ )

ఘ‌జియాబాద్‌లోని క్వారంటైన్ కేంద్రంలో మ‌హిళా న‌ర్సుల ఎదుటే అర్ధ‌న‌గ్నంగా తిరుగుతూ, అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడుతూ అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన త‌బ్లిగి జ‌మాత్ స‌భ్యులపై ప్ర‌జా భ‌ద్ర‌త చ‌ట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు న‌మోదు చేయాల‌ని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ శుక్ర‌వారం ఆదేశాలు జారీ చేశారు. త‌బ్లిగి స‌భ్యులు ఉన్న‌ కోవిడ్‌-19 వార్డులో మ‌హిళా న‌ర్సులు, మ‌హిళా పోలీసులను తొల‌గించాల‌ని పేర్కొన్నారు. మ‌ధ్య‌ప్రదేశ్‌లోని ఇండోర్‌లో వైద్య‌సిబ్బందిపై దాడి వంటి ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో చోటు చేసుకోకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని యోగి ఆదిత్య‌నాథ్‌ అధికారుల‌ను ఆదేశించారు. కాగా ఓ వ్య‌క్తి వ‌ల్ల దేశ ప్ర‌యోజ‌నాల‌కుగానీ లేదా శాంతి భ‌ద్ర‌త‌ల‌కుగానీ ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని భావించిన‌ప్పుడు అత‌నిపై ఎన్ఎస్ఏ ప్ర‌యోగించే అవ‌కాశం ఉంటుంది. (డాక్ట‌ర్ల‌పై ఉమ్మివేసిన‌వారి అరెస్ట్‌)

(కదిలిస్తే కన్నీళ్లే!)

>
మరిన్ని వార్తలు