ప్రభుత్వంపై కేథలిక్‌ బిషప్‌ సంచలన ఆరోపణలు

22 Dec, 2017 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మత విశ్వాసాల ఆధారంగా దేశం విభజించబడిందని.. కేథలిక్‌ బిషప్‌ కాన్ఫెరెన్స్‌ ఆఫ్‌ ఇండియా (సీబీసీఐ) ఆరోపించింది. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం దురదృష్టమని సీబీసీఐ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని వర్గాలన్నీ మత ప్రాతిపదికన చీలిపోయాయని, ఇటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని సీబీసీఐ పిలుపునిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వంపై విశ్వాసం సన్నిగిల్లుతోందని.. క్రైస్తవ సమాజం నుంచి ఈ భయం మరింత ఎక్కువగా ఉందని సీబీసీఐ అధ్యక్షుడు, కార్డినల్ బసిలియోస్‌ క్లీమేస్ చెప్పారు. 

అమాయకులైన మతాధికారులపై ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందని ఆయన అన్నారు. అమాయక, పేద మతాధికారులను ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు. ఈ పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లుతోందని ఆయన.. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

గత వారం మధ్యప్రదేశ్‌లోని సాత్నా పట్టణంలో 30 మంది మతాధికారులు కారోల్స్‌ పాడుతుండగా.. అరెస్ట్‌ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే గ్రామాల్లోని ప్రజలను భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు బలవంతంగా మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 

మరిన్ని వార్తలు