పార్లమెంటుపై నమ్మకం పోతోంది

2 Aug, 2018 03:40 IST|Sakshi
కాంగ్రెస్‌ నేత ఆజాద్‌కు ఔట్‌స్టాండింగ్‌ పార్లమెంటేరియన్‌ అవార్డునందిస్తున్న రాష్ట్రపతి కోవింద్‌. చిత్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా

మోదీ

ఉత్తమ పార్లమెంటేరియన్లకు పురస్కారాల ప్రదానం

న్యూఢిల్లీ: పార్లమెంటు సజావుగా నడవడంలో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటుపై, ఎంపీలపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. లోక్‌సభ, రాజ్యసభ సమర్థవంతంగా నడిచేలా ఎంపీలు బాధ్యత తీసుకోవాలని మోదీ సూచించారు. సామాన్య ప్రజల సమస్యలను తెలపడం, వారి సంక్షేమానికి కృషిచేసేందుకు ప్రతి ఎంపీకీ అవకాశం రావాలన్నారు. లేదంటే దేశం చాలా నష్టపోతోందన్నారు. 2014–17 కాలానికి ఉత్తమ పార్లమెంటేరియన్లకు పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో అవార్డులిచ్చిన సందర్భంగా మోదీ మాట్లాడారు.

నజ్మా హెప్తుల్లా, హుకుమ్‌దేవ్‌ నారాయణ్‌ యాదవ్, గులాంనబీ ఆజాద్, దినేశ్‌ త్రివేది, భర్తృహరి మహతాబ్‌ ఈ అవార్డులందుకున్నారు. ఎంపీలు ఓ పార్టీకో, ఓ నియోజకవర్గానికో పరిమితం కారాదని ప్రజల సమస్యల పరిష్కారంలో విస్తృతాంశాలపై చర్చించాలని రాష్ట్రపతి కోవింద్‌ అన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయడం కోసం విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని వెంకయ్య నాయుడు అన్నారు. చాలాసార్లు అధికార పార్టీ ఎంపీలే పార్లమెంటును అడ్డుకున్నారని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్‌ 

కరోనాకు 53 మంది బలి

దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత!

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు 

కరోనా పోరు: శభాష్‌ చిన్నారులు

సినిమా

అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

సరోజినీ నాయుడుగా...

వైరసవత్తరమైన సినిమాలు

తెలంగాణలో మరో 27 కరోనా కేసులు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా