‘తపాలా కార్యాలయంలేని ఓ దేశం’

20 Aug, 2019 13:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ది కంట్రీ వితౌవుట్‌ ఏ పోస్టాఫీస్‌ (తపాలా కార్యాలయం లేని ఓ దేశం)’ అంటూ అమెరికాలో నివసించిన కశ్మీరీ కవి ఆఘా షాహిద్‌ అలీ 1997లో ఓ కవిత రాశారు. 1990లో కశ్మీర్‌లో మిలిటెన్సీ తారా స్థాయికి చేరుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏడు నెలల పాటు తపాలా సేవలను నిలిపివేశారు. అప్పుడు పోస్టాఫీసుల్లో గుట్టలు గుట్టలుగా ఉత్తరాలు, పార్సళ్లు పేరుకు పోయాయి. ఆ పరిస్థితిని దష్టిలో పెట్టుకొన ఆయన ఈ కవిత రాశారు. ఆ తర్వాత 2001లో ఆయన మరణించారు. అయితే ఆయన రాసిన ఆ కవితా ఇప్పటికీ బతికే ఉంది. ఇప్పుడు కూడా కశ్మీర్‌లో అదే పరిస్థితి ఏర్పడింది. 

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోకి 370వ అధికరణాన్ని ఎత్తివేస్తూ, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో టెలిఫోన్, మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యాలను నిలిపివేసినప్పుడే తపాలా సేవలను కూడా నిలిపివేశారు. ఈ విషయం అంతగా దేశం దష్టికి రాలేదు. ఇప్పటికి కూడా కశ్మీర్‌లో తపాలా సేవలకు ఇంకా పునరుద్ధరించలేదు. మిగతా సర్వీసులను ఇప్పటికే పాక్షికంగానైనా పునరుద్ధరించారు. దీంతో ఇప్పటి కశ్మీరీ పరిస్థితికి ‘ది కంట్రీ వితౌవుట్‌ ఏ పోస్టాఫీస్‌’ పేరిట నాడు షాహిద్‌ అలీ రాసిన కవితా పంక్తులను ప్రముఖ కర్ణాటక çసంగీత విద్వాంసుడు టిఏం కష్ణ గుర్తు చేశారు. ఒకప్పుడు తాను చదివిన ఆ కవితా పంక్తులను గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాకు విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కశ్మీర్‌కు ఎలాంటి ఉత్తరాలుగానీ పార్సళ్లుగానీ బట్వాడా చేయరాదంటూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఢిల్లీలోని తపాలా విభాగానికి చెందిన డాక్‌ భవన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. శ్రీనగర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన తపాలా విభాగానికి కశ్మీర్‌ రాష్ట్రవ్యాప్తంగా 1965 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్‌ సౌకర్యాలు పెరిగిన నేటి పరిస్థితుల్లో ప్రజలు తపాలా సేవలు ఉపయోగించుకోవడం తగ్గుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలకు మాత్రం ఈ సేవలు ఇప్పటికీ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించం'

సరిహద్దుల్లో పాక్‌ దుశ్చర్య : జవాన్‌ మృతి

ఈసారి భారీ వర్షాలు ఎందుకు?

కారిడార్‌లోనే ప్రసవం.. రక్తపు మడుగులో..

చిదంబరానికి భారీ షాక్‌

తండ్రిని స్మరిస్తూ.. ప్రియాంక భావోద్వేగం

అరగంట సేపు ఊపిరి బిగపట్టిన పరిస్థితి...

పాకిస్తాన్‌కు ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ హెచ్చరికలు

కశ్మీర్‌పై చేతులెత్తేసిన ప్రతిపక్షం

కన్న కూతుళ్లపై అత్యాచారం;గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన తల్లి

భారీ వరద: ఢిల్లీకి పొంచి ఉన్న ముప్పు

రాయ్‌బరేలి రాబిన్‌హుడ్‌ కన్నుమూత

రోజు లడ్డూలే... విడాకులు ఇప్పించండి

మరో మైలురాయిని దాటిన చంద్రయాన్‌-2: శివన్‌

భారీ ఉగ్రకుట్ర: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌

జయలలిత మేనకోడలి సంచలన నిర్ణయం

యడ్డీ కేబినెట్‌ ఇదే..

చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌–2

‘400 మందికి కేవలం 2 మరుగుదొడ్లేనా?’

రాజీవ్‌కు ‍ప్రధాని మోదీ, సోనియా నివాళి

రాహుల్‌కి సుప్రియా సూలే ‘గ్రీన్‌ ఛాలెంజ్‌’ 

విబూది

ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు

నేడే కక్ష్యలోకి చంద్రయాన్‌–2

సంగీత దిగ్గజం ఖయ్యాం కన్నుమూత

ఐఏఎఫ్‌ డేర్‌డెవిల్‌ ఆపరేషన్‌

సీఏపీఎఫ్‌ రిటైర్మెంట్‌ @ 60 ఏళ్లు

కశ్మీర్‌లో పాఠాలు షురూ

మాజీలు బంగ్లాలను ఖాళీ చేయాల్సిందే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

వరదల్లో చిక్కుకున్న హీరోయిన్‌

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!

ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌!

మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!