ఆ ప్రేమకథ ఎక్కడ మొదలైందంటే...

22 Aug, 2017 19:10 IST|Sakshi
ముంబై: రెండు హృదయాల మధ్య ప్రేమకథలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుస్తాయో? అదే విధంగా ముగింపు కూడా ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే జంట మాత్రం మంచి ముగింపునే కొరుకుంటోంది. ముంబైలోని ఓ లింగ మార్పిడి కేంద్రంలో చిగురించిన ప్రేమకథే ఇది. 
 
ఆర్వ్‌ అప్పుకుట్టన్‌ పుట్టకతోనే మహిళ, సుకన్య కృష్ణ అనే వ్యక్తిని మూడేళ్ల క్రితం ముంబైలోని ఓ లింగ మార్పిడి కేంద్రంలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఫోన్‌ నంబర్లు మాత్రమే మార్చుకున్న వాళ్లు తర్వాత మనసులు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. అతను ఆమెగా, ఆమె అతనుగా మారిన తర్వాత వాళ్ల మధ్య అప్యాయతలు ఎక్కువ అయ్యాయి. దీంతో మూడు ముళ్లతో ఒకటవుదామని నిర్ణయించుకున్నారు. 
 
"నా జీవితం మొత్తం సుకన్యతోనే గడపాలనుకుంటున్నా'' అని 46 ఏళ్ల అప్పుకుట్టన్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అధికారిక పత్రాలు రాగానే కేరళలో సాంప్రదాయబద్ధంగా మేము ఒకటవుతాం అని చెప్పారు. చట్టప్రకారం ఎలాంటి సమస్యలు ఎదురుకాబోవని భావిస్తున్నామని, అయితే ప్రజలు తమ గురించి ఎలా స్పందిస్తారో అనే ఆలోచిస్తున్నామన్నారు. సాధారణంగా లింగ మార్పిడి చేయించుకున్న వాళ్ల విషయంలో చిన్నచూపు సహజమేనంటున్న ఆ జంట, పుట్టే పిల్లల్ని ఈ సంఘం ఎలా చూస్తుందోనని తమ కుటుంబ సభ్యులు ఆవేద చెందుతున్నారని తెలిపింది. అయితే ఈ విషయంలో సంఘంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు అప్పుకుటన్‌ కూడా సర్జరీ అయిన తర్వాత ఉద్యోగం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకానోక టైంలో దుబాయ్‌ వీసా కూడా తిరస్కరణకు గురైందని చెబుతున్నాడు. ఇక 20 ఏళ్ల సుకన్య కృష్ణ లింగ మార్పిడికే కాదు, ప్రేమకు కూడా కుటుంబ సభ్యులు అడ్డుచెప్పలేదు. "మమల్ని విమర్శించే వారికి మా ప్రేమకథను విడమరిచి చెబుతున్నాం" అని కృష్ణ చెబుతోంది.  తమలాగే లింగమార్పిడి పెళ్లి చేసుకోవాలే జంటలకు తాము ఎప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తామని తెలిపారు. త్వరలో హిందూ సాంప్రదాయంగా పెళ్లి చేసుకుని ఓ బిడ్డను దత్తత కూడా తీసుకోవాలనుకుంటున్నారు.
మరిన్ని వార్తలు