పెళ్లికి వ‌చ్చేవారికి ఇవి త‌ప్ప‌నిస‌రి

7 May, 2020 08:21 IST|Sakshi

అతిథులు కొద్దిమందే..

సామాజిక దూరం పాటిస్తూ వివాహం

ఆన్‌లైన్‌లో బంధువుల హాజ‌రు

న్యూ ఢిల్లీ: క‌రోనా కాదు దాని తాత లాంటి వైర‌స్ వ‌చ్చినా త‌మ పెళ్లి ఆగేది లేదంది ఓ కొత్త జంట‌. దీనికి తోడు ప్ర‌భుత్వం కూడా 50 మంది అతిథుల మ‌ధ్య పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని అనుమ‌తులివ్వ‌డంతో వారు ఒక‌ట‌వ్వ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ప‌డినట్లేన‌నుకుంది. ఇంకేముందీ... ఆకాశ‌మంత పందిరి, భూదేవి అంతా పీట‌లు వేయ‌కపోయినా అనుకున్న ముహూర్తానికి మ‌నువాడి మ‌మ అనిపించింది. బుధ‌వారం ఢిల్లీకి చెందిన ఓ జంట ఇంట్లోనే వివాహం చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అతి కొద్దిమంది అతిథులు మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ కూర్చుని ద‌గ్గ‌రుండి వివాహాన్ని వీక్షించారు. (భోజనాలు.. బరాత్‌లు.. లేకుండానే!)

అవి కూడా పెళ్లి సామానే..
అయితే బంధుబ‌ల‌గం మ‌ధ్య జ‌ర‌ప‌లేక‌పోతున్నామే అని కొంచెం లోటుగా భావించామ‌ని, కానీ పిల్ల‌ల సంతోషానికి మించి కావాల్సిందింకేముంటుందని వ‌రుడి తల్లి వినీత శ‌ర్మ పేర్కొంది. బంధువుల‌కు ఆన్‌లైన్‌లోనే ఫొటోలు, వీడియోల ద్వారా వివాహాన్ని చూపించామ‌ని తెలిపింది. వాళ్లు కూడా ఆన్‌లైన్‌లో ఆశీస్సులు పంపిస్తుండ‌టం సంతోషంగా ఉందంటోంది. వ‌రుడి తండ్రి ప‌వ‌న్ శ‌ర్మ మాట్లాడుతూ.. "ప్ర‌స్తుతం క‌రోనా కాలం న‌డుస్తున్న‌ప్ప‌టికీ మేము పెళ్లిని వాయిదా వేయాల‌నుకోలేదు. పెళ్లికి కావాల్సిన వ‌స్తువుల్లో శానిటైజ‌ర్లు, మాస్కులు కూడా చేర్చాం. వివాహానికి వ‌చ్చిన కొద్దిమందికి వీటిని అందించాం. అలాగే ఎవరూ ఒక‌రికి ఒక‌రు ఆనుకొని కూర్చోకుండా భౌతిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకున్నాం" అని పెళ్లి కార్య‌క్ర‌మాన్ని వివ‌రించాడు. (లాక్‌డౌన్‌ : వినూత్నంగా బిగ్‌బాస్‌ విన్నర్‌ పెళ్లి..)

మరిన్ని వార్తలు