పచౌరీపై అభియోగాలు మోపండి

15 Sep, 2018 05:32 IST|Sakshi

న్యూఢిల్లీ: టెరీ (భారత్‌లో విద్యుత్, పర్యావరణం, సహజ వనరులపై పరిశోధనలు చేసే సంస్థ) మాజీ చీఫ్‌ ఆర్కే పచౌరీపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి అభియోగాలు మోపాలని ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 354 (దౌర్జన్యంగా వ్యవహరించడం), 354 (ఏ) (శారీరకంగా తాకేందుకు ప్రయత్నించడం), 509 (వేధించడం, అసభ్య పదజాలం, అసభ్య చేష్టలకు పాల్పడటం) కింద అభియోగాలు నమోదు చేయాలని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ చారు గుప్తా ఆదేశించారు. 2015, ఫిబ్రవరి 13న టెరీ మాజీ ఉద్యోగి ఒకరు తనతో పచౌరీ అసభ్యంగా ప్రవర్తించారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మార్చి 21న పచౌరీకి ముందస్తు బెయిల్‌ మంజూరైంది. 2016 మార్చి 1న ఢిల్లీ పోలీసులు 1,400 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు