సుప్రీంలో జయలలితకు చుక్కెదురు

26 Sep, 2014 17:12 IST|Sakshi
సుప్రీంలో జయలలితకు చుక్కెదురు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు తన తీర్పును శనివారం వెల్లడించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జయలలిత దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో శనివారం నాడే జయయలిత కేసులో బెంగళూరు కోర్టు తీర్పు ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లయింది. జయలలితకు తన ఆదాయానికి మించి 66 కోట్ల రూపాయల మేరకు ఆస్తులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ సుదీర్ఘ కాలం పాటు జరిగింది.

ఈ కేసులో శనివారమే తీర్పు వెలువడనుంది. ఈ సందర్భంగా రూ. 1.08 లక్షల మంది పోలీసులతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జయలలితకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే.. తమిళనాడు రాజకీయాల్లో అది భారీ కుదుపే అవుతుంది. ఒక్కసారిగా ఆ రాష్ట్ర రాజకీయాలు గణనీయంగా మారిపోతాయి.

>
మరిన్ని వార్తలు