ఎంతమందిని చేర్చుకున్నారో చెప్పండి

14 Oct, 2014 00:48 IST|Sakshi
ఎంతమందిని చేర్చుకున్నారో చెప్పండి

 న్యూఢిల్లీ: నగర డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్(డీఓఈ), ఈడీఎంసీ తీరుపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. పరిసర ప్రభుత్వ పాఠశాలల్లో 81 మంది విద్యార్థులను చేర్చుకోవాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఓఈకి సోమవారం  జస్టిస్ వీకే షాలీ నేతృత్వంలోని ధర్మాసనం కోర్టుధిక్కారణ నోటీసు జారీ చేసింది.  అదేవిధంగా తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఎంతమందిని చేర్చుకొన్నారో చెప్పాలని ప్రశ్నించింది. 81 మంది విద్యార్థులను పరిసర ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకో లేదని ఎన్‌జీవోస్ సామాజిక న్యాయ నిపుణుడు సెప్టెంబర్, 17వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణను కోర్టు జనవరి 28, 2015కు వాయిదా వేస్తూ, ఈ విషయమై సరైన నివేదకను అందజేయాలని డీఓఈ, ఈడీఎంసీలకు సూచించింది
 
 .కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి.. స్థానికతను తెలియజేసే ధ్రువీకరణ, పుట్టినతేదీ పత్రాలు లేని కారణంగా స్కూళ్లలో అడ్మిషన్లను తిరస్కరించినట్లు ఆరోపిస్తూ 14 ఏళ్ల వయస్సు ఉన్న 81 మంది విద్యార్థులు సెప్టెంబర్, 17వ తేదీన పిటిషనర్ ద్వారా కోర్టును ఆశ్రయించారు. పై కారణాలను సాకుగా చూపుతూ తమకు ఈడీఎంసీ స్కూళ్లలో అడ్మిషన్లు నిరాకరించినట్లు తూర్పు ఢిల్లీలోని యమునాఖాదర్ ప్రాంతంలోని విద్యార్థులు పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం అడ్మిషన్లకోసం స్కూళ్లను సంప్రదించాలని విద్యార్థులకు సూచిస్తూ, ఈ మేరకు స్కూళ్లను కూడా వారికి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.  డివిజన్ బెంచ్ ఆదేశాలను స్కూళ్లు పట్టించుకోలేదని ఎన్‌జీవోస్ తరఫు న్యాయవాది అశోక్ అగర్వాల్ సోమవారం తుది విచారణలో కోర్టు ముందు వాదించారు. విద్యాహక్కు చట్టాన్ని (ఆర్‌టీఈ) ఢిల్లీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే విషయం ఈ కేసులో స్పష్టంగా వెల్లడైందన్నారు. పేద విద్యార్థులను కావాలనే విద్య దూరం చేస్తున్నారని వాదించారు.
 

మరిన్ని వార్తలు