క‌రోనా: ఆమె డ్యాన్స్‌కు ఫిదా

2 Apr, 2020 19:10 IST|Sakshi

సాక్షి, కేర‌ళ‌: క‌రోనాను అధిగ‌మించ‌డానికి సినీ తార‌లు, విశ్లేష‌కులు, క‌ళాకారులు..ఇలా ప్ర‌తీఒక్క‌రూ త‌మ‌కు తోచిన విధంగా అవ‌గాహన క‌ల్పిస్తున్నారు. ఇటీవ‌ల కేర‌ళ‌లోని ప్ర‌ముఖ శాస్త్రీయ నృత్యకారిణి డాన్సర్ డాక్టర్ మెథిల్ దేవికా అద్భుత‌మైన నృత్యంతో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ప్ర‌తీ ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరింది. ఆమె ప్ర‌ద‌ర్శించిన మోహినియట్టం వీడియోను  ఏప్రిల్‌1న యూట్యూబ్‌లో షేర్ చేసింది. దీనికి ఇప్ప‌టికే వేలాది లైకులు, వంద‌లాది కామెంట్లు వ‌చ్చాయి. 

మెథిల్ దేవికా ప్ర‌ద‌ర్శ‌న‌కు నెటిజ‌న్ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. క‌రోనాపై పోరాడ‌టానికి మీ డ్యాన్స్‌నే ఆయుధంగా వాడుకున్నారు. గ్రేట్‌.. మీరు రియ‌ల్ ఆర్టిస్ట్‌. క‌ళాకారులంద‌రికీ ప్రేర‌ణ‌గా నిలుస్తున్నారు. మీ కాన్సెప్ట్ చాలా బాగుంది అంటూ  నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. గ‌త నెల‌లో కూడా పేస్‌బుక్‌లో దేవికా ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. దానికి కూడా యూజ‌ర్ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రెండువేల‌కు పైగా కేసులు న‌మోద‌వ్వ‌గా, 58 మంది చ‌నిపోయారు. 

మరిన్ని వార్తలు