కరోనా వ్యాప్తి : సెలవుల్లో గవర్నర్‌

16 Mar, 2020 13:54 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనాను(కోవిడ్‌) ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఆయన తనవెంట వ్యక్తిగత, పోలీసు, వైద్య సిబ్బందిని తీసుకెళ్లడంపై కేరళ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. గవర్నర్‌కు సెక్యూరిటీ కల్పించాలనే ఉద్దేశ్యంతో నేదుమన్‌గడ్‌ డీఎస్పీ ముఖ్యమైన కరోనా సమావేశానికి గైర్హాజరయ్యాడని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎప్పుడైనా సెలవులు తీసుకునే హక్కు గవర్నర్‌కు ఉంటుందని, కానీ ఇది సరియైన సమయం కాదని ఎమ్మెల్యే వీ.కె ప్రశాంత్‌ పేర్కొన్నారు.

ఆరోపణలపై గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ స్పందిస్తూ.. తాను గిరిజన ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అటవీ అధికారి కెఐ.ప్రదీప్ కుమార్, రేంజ్ ఆఫీసర్ పలోడ్‌లతో చర్చించడానికి వెళ్లానని ట్విటర్‌లో వివరణ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించామని తెలిపారు. కాగా కేరళలో ఇప్పటి వరకు 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. 

చదవండి: షాకింగ్‌గా ఉంది.. కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌

మరిన్ని వార్తలు