భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా!

9 Jul, 2020 14:54 IST|Sakshi

సాక్షి, చెన్నై: భారత్​లో కోవిడ్​–19 వ్యాప్తి రేటు బాగా పెరిగిందట. మార్చి నెలతో పోల్చుకుంటే ప్రస్తుత వ్యాప్తి రేటులో గణనీయమైన మార్పులు ఉన్నాయని చెన్నైకి చెందిన గణితశాస్త్ర సంస్థ(ఐఎంఎస్‌) చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. మార్చి నెల 4వ తేదీ నుంచి కరోనా వైరస్​ వ్యాప్తి రేటు 1.83 కంటే తక్కువగా నమోదైందని చెప్పింది. కానీ అన్​లాక్​ 2 ప్రారంభమైన జూలైలో వ్యాప్తి రేటులో పెరుగుదల కనిపించిందని తెలిపింది. ప్రభుత్వం కోవిడ్​ వ్యాప్తి రేటును 1కి తేవాలని భావిస్తోందని వెల్లడించింది. (లైవ్ వీడియోలో స్నానం చేస్తూ అడ్డంగా..)

ప్రస్తుతం కరోనా వ్యాప్తి రేటు సంఖ్య 1.19గా ఉంది. అంటే సగటున వైరస్​ సోకిన వ్యక్తి 1.19 మందికి దాన్ని వ్యాప్తి చేస్తున్నాడని అర్థమని ఆ సంస్ధకు చెందిన డాక్టర్‌ సితాబ్ర సిన్హా వెల్లడించారు. వ్యాప్తిలో హెచ్చుతగ్గులను తెలుసుకోవడానికి కనీసం 10 నుంచి 14 రోజులు పడుతుందని ఆమె వివరించారు. జూన్​ నెల రెండో అర్ధభాగం, జులై ప్రారంభంలో జరిగిన అనేక పరిణామాలు కోవిడ్ వ్యాప్తి రేటును పెంచాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు బాగానే ఉన్నాయన్నారు. ఢిల్లీ, హరియాణాల్లో వ్యాప్తి రేటు సాధారణంగానే ఉందని తెలిపారు.(చేప‌ల వ్యాపారి నుంచి 119 మందికి క‌రోనా)

మార్చి నెలలో ఇండియాలో వ్యాప్తి రేటు 1.83గా ఉంది. ఇదే టైంలో వుహాన్​లో 2.14, ఇటలీలో 2.73గా ఉంది. ఏప్రిల్​ 6న ఇండియాలో 1.55గానూ, ఏప్రిల్ 11న 1.49గానూ ఉంది. జూన్​ ప్రారంభంలో 1.2కి తగ్గింది.  జూన్​ 26న 1.11గా నమోదైంది. మళ్లీ జులై ప్రారంభంలో 1.19కి పెరిగిందని సిన్హా వివరించారు. సంస్ధ అంచనాల ప్రకారం ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ వరుసగా 1.66, 1.65, 1.32 అధిక వ్యాప్తి రేటుతో ఉన్నాయి. గతంలో అత్యధిక వ్యాప్తి రేటు కలిగిన గుజరాత్​, వెస్ట్​ బెంగాల్​లో ప్రస్తుతం వైరస్​ వ్యాప్తి వేగం తగ్గినట్లు సిన్హా చెప్పారు.

తన అంచనా ప్రకారం జులై నెలాఖరుకి దేశవ్యాప్తంగా ఆరు లక్షల యాక్టివ్​ కరోనా కేసులు ఉంటాయని పేర్కొన్నారు. జులై 21 నాటికి మహారాష్ట్రలో కేసులు 1.5 లక్షలకు, తమిళనాడు లక్షకు చేరొచ్చని సిన్హా అంచనా వేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు