కరోనా: ప్రసిద్ధ కడాయి హల్వా యజమాని ఆత్మహత్య

25 Jun, 2020 17:50 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన తిరునల్వేలి ఇరుట్టు కడాయి హల్వా యజమాని హరిసింగ్(70) కరోనా వ్యాధి సోకడంతో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన అనూహ్యంగా ఉరివేసుకుని చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. అభిమానులు ట్విటర్‌లో హరిసింగ్ కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

యూరినరీ ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతున్న సింగ్‌ను మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా గురవారం ఉదయం పాజిటివ్ గా తేలడంగా ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరోవైపు హరిసింగ్ అల్లుడు కూడా కోవిడ్-19 బారిన పడినట్టు తెలుస్తోంది. 

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగిస్తామని తిరునెల్వేలి  డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) ఎస్ శరవణన్ తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది ఇరుట్టు కడాయి హల్వా. 100 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ దుకాణం  ఇప్పటికీ  తిరునల్వేలిలో పర్యాటక కేంద్రంగా ఉందంటే ఈ హల్వా ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

చదవండి :  కరోనా మందు : మరిన్ని చిక్కుల్లో రాందేవ్

మరిన్ని వార్తలు