సీపీఐ నేత గురుదాస్‌ గుప్తా ‍కన్నుమూత

31 Oct, 2019 08:58 IST|Sakshi

కోల్‌కత్తా: సీపీఐ సీనియర్‌ నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా (83) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కోల్‌కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభకూ పలుమార్లు ఎన్నికయ్యారు. ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ (ఏఐటీయుసీ) ప్రధాన కార్యదర్శిగా గురుదాస్‌ దాస్‌గుప్తా సేవలు అందించారు. దాస్‌గుప్తా మరణంపై సీపీఐ జాతీయ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

గురుదాస్‌ దాస్‌గుప్తా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ప్రజలు, కార్మికుల సంక్షేమానికి గురుదాస్‌ దాస్‌గుప్తా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా ఆయన నిలిచారని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా