టోల్‌గేట్‌లో మాజీ ఎమ్మెల్యే తగాదా

20 Jan, 2020 07:38 IST|Sakshi
బాలభారతి

చెన్నై, టీ.నగర్‌: టోల్‌గేట్‌లో చార్జీ చెల్లించేందుకు నిరాకరించి సీపీఎం మాజీ ఎమ్మెల్యే తగాదాకు దిగడంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. కరూరు– తిరుచ్చి జాతీయ రహదారిలో మనవాసి టోల్‌గేట్‌కు మారుతి ఆల్టో కారులో శనివారం సాయంత్రం 4.30 గంటలకు సీపీఎంకు చెందిన దిండుగల్‌ మాజీ ఎమ్మెల్యే బాలభారతి వచ్చారు. టోల్‌గేట్‌ మీదుగా ఉచితంగా వెళ్లేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యేకు ఉచిత ప్రవేశం లేదని ఉద్యోగులు తెలిపారు. బాలభారతితో వచ్చిన పార్టీ వ్యక్తులు ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. మాయనూరు పోలీసులు, టోల్‌గేట్‌ అధికారులు వచ్చి బాలభారతితో మాట్లాడారు. ఆమె టోల్‌ చార్జీ చెల్లించేది లేదని ఖరాఖండిగా తెలిపారు. తర్వాత ఆమెను ఎమ్మెల్యేగా నమోదు చేసి ఉచితంగా పంపివేశారు. 70 రూపాయల చార్జీ చెల్లించాల్సిన వివాదానికి 30 నిమిషాలకు పైగా టోల్‌గేట్‌లో మాజీ ఎమ్మెల్యే రోడ్డును అడ్డగించి రాద్దాంతం చేయడంతో వాహనచోదకులు అవస్థలు పడ్డారు.

మరిన్ని వార్తలు