ఓటమిపై స్పందించిన సీపీఎం

3 Mar, 2018 17:14 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఏచూరి

సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర ఎన్నికల ఓటమిపై సీపీఎం స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ డబ్బు, అధికారాన్ని ఉపయోగించి వామపక్షేతర శక్తులను ఒక తాటిపైకి తీసుకొచ్చిందని.. ఈ క్రమంలోనే అది విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. 

‘డబ్బును భారీ స్థాయిలో పంచి బీజేపీ అనైతిక రాజకీయాలను ప్రదర్శించింది. సీపీఎం, కాంగ్రెస్‌ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకోవటంలో విజయం సాధించింది. అయినప్పటికీ వామపక్ష పార్టీ 45 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అందుకు త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. 

అంతకు ముందు ఆయన ట్విట్టర్‌లో కూడా స్పందించారు. త్రిపుర ఓటర్లు బీజేపీ-ఐపీటీఎఫ్‌ కూటమికి ప్రజలు పట్టం కట్టారని, 25 ఏళ్లుగా తమకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే బీజేపీ మోసపూరిత రాజకీయాలను ప్రశ్నించటం మాత్రం తాము ఆపబోమని.. దేశవ్యాప్తంగా బీజేపీ-ఆరెస్సెస్‌ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు