చిన్నారికి కొత్త జీవితం

17 Sep, 2018 09:48 IST|Sakshi
బెంగళూరులో బ్రెట్‌లీతో బాలిక సాక్షి, చిన్నారి సాక్షి

పుట్టుకతోనే బధిర, మూగ  

క్రికెటర్‌ బ్రెట్‌ లీ ఆర్థిక సాయంతో శస్త్రచికిత్స  

కర్ణాటక, రాయచూరు రూరల్‌: పుట్టుకతోనే బధిర, మూగ అయిన చిన్నారి పాప జీవితంలో కొత్త వెలుగులు వచ్చాయి. బాలిక తల్లిదండ్రుల కష్టాలు తీరాయి. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా జవళగేరలో నివాసం ఉంటున్న బాలనగౌడ, కవిత అనే రైతు దంపతులకు సాక్షి అనే మూడేళ్ల కూతురు ఉంది. బాలిక పుట్టుకతోనే మూగ, చెవిటి. పాప అందరిలాగే వినాలని, మాట్లాడాలని కన్నవారు చేసిన ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాయచూరు ఆస్పత్రులు, మైసూరులోని మానస గంగోత్రి ఆస్పత్రిలో కూడా వైద్యం చేయించినా ఎలాంటి ఫలితం లభించలేదు. మూడేళ్ల పాటు శ్రమించారు. ఏడాది పాటు ఫిజియో థెరపీ చికిత్సలు చేయించారు. 

రూ. 16 లక్షలతో ఆపరేషన్‌   
సింధనూరు అంగనవాడి కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన బాల స్వస్థ పథకం ద్వారా చికిత్సకు యత్నించారు. చెవులు మాటలు, చెవులు వినపడాలంటే రూ.16 లక్షలు ఖర్చువుతాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద నమోదు చే సుకోగా, చికిత్సకు ఎంపికైంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్‌ బ్రెట్‌ లీ చి న్నారి శస్త్రచికిత్సకు ఆర్థికసాయం అందజేశారు. దీంతో బెంగళూరులోని ఒక కార్పొ రేట్‌  ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ తదితర ఆధునిక పరికరా లను బాలిక చెవిలో అమర్చారు. దీంతో బాలిక చక్కగా వినడంతో పాటు మా ట్లాడుతోంది.బ్రెట్‌లీకి బాలికతల్లిదండ్రులు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు