సుప్రీం వద్దన్నా మందిర్‌ తథ్యం

8 Dec, 2017 11:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అయోధ్య అంశం మళ్లీ తెరపైకి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రామమందిర నిర్మాణంపై బీజేపీ దూకుడు కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం చేపడతామని ఆ పార్టీ నేత తపన్‌ భౌమిక్‌ అన్నారు.

వివాదాస్పద స్థలంలోనే రామాలయ నిర్మాణం జరిగేలా పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందేలా చొరవ చూపాలన్నారు. సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా మందిరం నిర్మించేలా చూస్తామన్నారు. దేశంలోని కోట్లాది హిందువులు రామాలయ నిర్మాణం జరిగేలా చూస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
 

>
మరిన్ని వార్తలు