కరోనా : బ్యాండ్‌తో అదరగొట్టిన సీఆర్‌పీఎఫ్‌

5 Apr, 2020 19:22 IST|Sakshi

హ‌ర్యానా: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వాలు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు ఎవరికి తోచిన విధంగా వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా స‌రిహ‌ద్దుల్లో దేశ‌ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త అందించే సెంట్ర‌ల్ రిజ‌ర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌) మ్యూజిక్  బ్యాండ్ బృందం పాట‌లు, సంగీతంతో క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించింది. హ‌ర్యానాలోని గురుగ్రామ్ లో సీఆర్ పీఎఫ్ బృందం క‌రోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లను బ్యాండ్‌ రూపంలో అందించింది. 'యే దేశ్‌ కా బాయ్‌ సీఆర్‌పీఎప్‌.. సోషల్‌ డిస్టెన్స్‌ బనా కే రాఖో.. కరోనా కో హరానా హై.. హాత్ కో బార్ బార్ ధోనా.. బచోగే తుమ్ కరోనా సే.. ఘర్ పె రహోగే.. తోహ్ హి సురక్షిత్ రహోగే' అంటూ కొనసాగించారు. ఒకవైపు బ్యాండ్‌ కొనసాగిస్తూనే మరొకవైపు కరోనాపై అవగాహన పెంచుకోవాలంటూ పాటలు కూడా ఆలపించారు. ఇప్పటికే కోవిడ్‌-19కు సంబంధించి సీఆర్‌పీఎప్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఏర్పాటు చేసి మెడిసిన్‌, ఇతర నిత్యవసరాలను సరఫరా చేస్తుంది. కాగా దేశంలో ఇప్పటివరకు 3వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 77కు చేరుకుంది.
(ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం)
(కరోనా : ఆరు నిమిషాల వ్యవధిలోనే)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు