బెంగాల్‌లో నాటు బాంబు పేలుడు

11 Jun, 2019 10:56 IST|Sakshi

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. నార్త్‌ 24 పరగణ జిల్లాలోని కంకినారలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎండీ ముక్తర్‌(68) తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉన్నసమయంలో గుర్తు తెలియని దుండగులు అతని నివాసం ముందు నాటు బాంబును పేల్చారు. ఈ ఘటనలో పేలడంతో ముక్తర్‌తో పాటు మరొకరి ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్యతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాంబు దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కంకినారలో పోలీసులు భారీగా మోహరించారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే  ఈ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు బాగా తీరుగుతారని, దోపిడీ కోసమే ఇలాంటి ఘటనలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడ్డవారికి సహాయం అందించవల్సిందగా స్థానిక అధికారులును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా బాండు పేలుడు ఘటనలో రాజకీయ వ్యక్తుల ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్‌ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు